తరుణ్ తేజ్ పాల్ అరెస్టు
'తెహల్కా' మాజీ ఎడిటర్ తరుణ్ తేజ్ పాల్ ను గోవా పోలీసులు అరెస్టు చేశారు. విచారణకు హాజరయ్యేందుకు గోవా విమానాశ్రయంలో దిగిన తేజ్ పాల్ ను పోలీసులు అక్కడే అదుపులోకి తీసుకున్నారు. వెంటనే గోవా న్యాయస్థానంలో హాజరుపర్చనున్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన తేజ్ పాల్.. పోలీసుల ఎదుట విచారణకు హాజరయ్యేందుకే తాను వచ్చినట్లు తెలిపారు.